సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:38 IST)

ఆ హీరోయిన్ ఇంట్లో మద్యం - డ్రగ్స్ : అదుపులోకి బంగ్లాదేశ్ నటి

ఇటీవలి కాలంలో సినీ సెలెబ్రిటీలు మద్యం, డ్రగ్స్‌కు ఎక్కువగా బానిసలైపోతున్నారు. అనేకమంది ఈ తరహా కేసుల్లో చిక్కుకుంటున్నారు. శాండల్‌వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, ఇలా ప్రతి ఒక్క చిత్ర పరిశ్రమలోనూ ఇదే తంతు జరుగుతోంది. తాజాగా మరో నటిని పోలీసులకు చిక్కింది. 
 
ప్రముఖ బంగ్లాదేశ్ నటి పోరి మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్.ఏ.బీ) అదుపులోకి తీసుకుంది. జూన్ 8న బోట్ క్లబ్‌లో తనపై అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని పోరి మోనీ ఆరోపించింది. 
 
దీనిపై విచార‌ణ జ‌రిపించిన పోలీసులు బంగ్లాదేశ్ సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ రాకెట్ న‌డుస్తుంద‌ని గుర్తించారు. హీరోయిన్ కు కూడా ఇందులో సంబంధాలున్నాయని.. అందుకే ఈమెపై కొందరు దాడి చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి.
 
ఢాకాలోని బనానీలో పోరిమోనీ నివాసంలో బుధవారం నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించ‌గా, త‌నిఖీల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు కీలక ఆధారాలను సేకరించి ఆమెను ఎలైట్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.