ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:46 IST)

ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత క్రోబ్ బ్రౌజర్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ టెక్ దిగ్గజం ప్రకటించింది. నిజానికి గత 2014లో క్రోమ్ లోగోలో మార్పులు చేసింది. ఆ తర్వాత అంటే ఇపుడు దాన్ని డిజైన్‌ను మార్చింది.  
 
గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త క్రోమ్ ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించేవుంటారు. ఎనిమిదేళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. 
 
ఇక లోగోను నిశితంగా పరిశీలిలిస్తే, పాత లోగోలో ఉన్నట్టు ఇపుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు. అయితే, లోగోలో కనిపించే ఆ పాత నాలుగు రంగుల మునుపటి కంటే కాస్త కాంతివంతంగా మెరుస్తున్నాయి. మధ్యలో నీలిరంగు వృత్తం సైజును కొద్దిగా పెంచారు. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు హు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.