1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Hyper Aadi About His Controversy With Mahesh Kathi - Interview

కత్తి మహేష్‌తో మంచి క్రిటిక్.. సుత్తి రాజేష్ అంటేనే నాకు పడదు: హైపర్ ఆది

హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోషల్ మీడియాను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై కూడ

Hyper Aadi
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది సినీ క్రిటిక్ కత్తి మహేష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోషల్ మీడియాను ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై కూడా కామెంట్ చేశారు.

సోషల్ మీడియాను తాను వ్యతిరేకించనని అయితే నెగటివ్ విషయాలను షేర్ చేసే వాళ్లు తగ్గితే చాలునని, సోషల్ మీడియా ఎప్పుడూ పాజిటివేనని చెప్పారు. టీవీ ఛానళ్లు కూడా రేటింగ్ కోసం నెగటివ్ విషయాలపై టార్గెట్ చేస్తుంటాయని.. కానీ అలాంటివాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు.
 
ఇక కత్తి మహేష్‌కు తనకు ఎలాంటి వివాదం లేదని.. ఆయనో మంచి సినీ క్రిటిక్ అని హైపర్ ఆది కితాబిచ్చారు. ఇంకా క్యూట్ బాయ్. కత్తితో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. కానీ సుత్తి రాజేష్ అంటేనే తనకు పడదన్నారు. జబర్దస్త్‌ ద్వారా బయట ఏం జరిగినా కౌంటరేసే క్యారెక్టర్ తనదని, నెగటివ్ ఇష్యూ అయితేనే కౌంటరేస్తానని.. పాజిటివ్ అయితే ఎందుకేస్తామని ప్రశ్నించారు.

నెగటివ్ అంశాలను ఎత్తిచూపుతూ సెటైరికల్‌గా జోకులు పేల్చడమే తన స్టైల్ అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు. అలా సెటైరికల్‌గా జోకులేస్తే ప్రజలకు అది సులభంగా రిసీవ్ అవుతుందని.. తద్వారా ఓ సందేశాన్ని ఇచ్చినట్లవుతుందని హైపర్ ఆది తెలిపారు.
తర్వాతి కథనం
వర్మా.. ఖర్మఖర్మ.. పబ్లిసిటీ కోసం ఆడవారి సమస్యను కూడా వదలట్లేదు..