శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (14:16 IST)

కత్తి మహేష్‌తో తలనొప్పి.. కల్యాణ్ గారూ కాపాడండి: పూనమ్ కౌర్ విజ్ఞప్తి

కత్తి మహేష్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పవర్ స్టార్‌పై విమర్శలు గుప్పించడం.. పవన్ ఫ్యాన్సు కోపానికి ఆగ్రహానికి గురవడం కత్తికి అలవాటుగా మారిపోయింది. ఇంతలో హీరోయిన్ పూనమ్

కత్తి మహేష్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పవర్ స్టార్‌పై విమర్శలు గుప్పించడం.. పవన్ ఫ్యాన్సు ఆగ్రహానికి గురవడం కత్తికి అలవాటుగా మారిపోయింది. ఇంతలో హీరోయిన్ పూనమ్ కౌర్ సీన్లోకి వచ్చింది. కత్తిపై కామెంట్లు చేసి.. అనవసరంగా పవన్‌తో అక్రమ సంబంధం అంటూ కత్తి మహేష్ చేస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
పూనమ్ కౌర్ పవన్ కల్యాణ్‌చే మోసపోయిందని.. ఆతని కోసం ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని.. తిరుమలలో ఒకే గోత్రం కింద పూజలు కూడా చేయించిందని కత్తి మహేష్ ఆరోపిస్తున్న వేళ.. పూనమ్ సోషల్ మీడియా ద్వారా జనసేన అధినేత పవన్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. 
 
కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని పూనమ్ కౌర్ వాపోయింది. ఈ విషయంలో జనసేనాని కల్పించుకోవాలని.. తద్వారా తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుసగా ట్వీట్లు చేసింది. 
 
"గౌరవనీయ పవన్ కల్యాణ్ గారూ. ఈ నా పరిస్థితి నుంచి దయచేసి బయట పడేయండి. ఎందుకంటే, ఇది నా కెరీర్, కుటుంబంతో పాటు ముఖ్యంగా నా గౌరవానికి సంబంధించిన విషయం" అని మరో ట్వీట్‌లో పూనమ్ అభ్యర్థించింది. ఈ ట్వీట్లను పూనమ్ డిలీట్ చేసినా.. ఇమేజ్ రూపంలో పూనమ్ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.