శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (09:49 IST)

కాస్త ఎదగరా బాబూ?.. సంబంధం అంటగట్టడమేనా? : 'కత్తి'కి బన్నీ వాసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నటి పూనమ్ కౌర్‌కు మధ్య ఏదో సంబంధం ఉందంటూ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోపించిన విషయం తెల్సిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నటి పూనమ్ కౌర్‌కు మధ్య ఏదో సంబంధం ఉందంటూ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోపించిన విషయం తెల్సిందే. దీనిపై మెగా కాంపౌండ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే బన్నీ బాసు పేరు చెప్పకుండానే మహేష్‌కు "కత్తి"లాంటి కౌంటరిచ్చాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. 
 
"ఏవిధమైన సంబంధమూ లేని ఓ యువతికి యువకుడు సాయపడ్డాడంటే, వారిద్దరి మధ్యా ఏదో తప్పుడు బంధం ఉందని అర్థం చేసుకుంటే ఎలా? కాస్త ఎదగరా బాబూ" అని వ్యాఖ్యానించాడు. ఏ ఘటననూ, కత్తి పేరును ప్రస్తావించకుండా బన్నీ వాసు చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతోంది.