మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (13:43 IST)

పవన్ రేణూ దేశాయ్‌నే పట్టించుకోలేదు.. ప్రజల్ని ఎలా?: కత్తి మహేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడని దుమ్మెత్తిపోశాడు. పవన్ ఫ్యాన్స్ ఓ ముఖం లేని గుంపు వంటి వారని.. వారు తనతో పాటు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆదివారం ఏకిపారేశాడు. పవన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడని దుమ్మెత్తిపోశాడు. పవన్ ఫ్యాన్స్ ఓ ముఖం లేని గుంపు వంటి వారని.. వారు తనతో పాటు.. ఆయన భార్య రేణూ దేశాయ్ పైనా సామాజిక దాడికి దిగారని ఆరోపించాడు. రేణూ దేశాయ్ తన రెండో వివాహం గురించి ఒక్క మాట ప్రస్తావిస్తే, పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారని కత్తి మహేష్ గుర్తు చేశారు. రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని చంపేస్తామని హెచ్చరించారని కత్తి గుర్తు చేశారు. 
 
ఆ వ్యాఖ్యలను పవన్ ఏమాత్రం ఖండించలేదని.. అలాంటి వ్యక్తి ప్రజల కోసం ఏం చేస్తారని కత్తి మహేష్ ప్రశ్నించాడు. ప్రశ్నిస్తానని, ప్రజలకు అండగా ఉంటానని చెప్పే పవన్, తన అభిమానులను ఎంతమాత్రమూ కంట్రోల్ చేయలేకపోతున్నారని అన్నాడు. తాను ఓ మామూలు మనిషినని, తనపై అభిమానులు చేస్తున్న విమర్శలను, దాడిని, ఒక్క మాట చెప్పి పవన్ అడ్డుకోలేక పోతున్నారని ఆరోపించాడు. తన ప్రాణాలకు ముప్పు వుందని.. ఆ భయంతోనే పవన్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. చర్చకు పిలిచానన్నారు.