ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (12:56 IST)

పవన్ పూనమ్‌ను మోసం చేశాడా? అందుకే ఆత్మహత్యాయత్నం చేసిందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు గుప్పిస్తుంటే.. ఓ వైపు పవన్ ఫ్యాన్స్.. మరోవైపు సినీ నటి పూనమ్ కౌర్ మండిపడ్డారు. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ విమర్శలు గుప్పిస్తుంటే.. ఓ వైపు పవన్ ఫ్యాన్స్.. మరోవైపు సినీ నటి పూనమ్ కౌర్ మండిపడ్డారు. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌. ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి అత‌నికి డ‌బ్బులు డొనేట్ చేయండని పూనమ్ కౌర్ టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. తాను నటి పూనమ్ కౌర్‌ను ఏవిధంగానూ ఇబ్బంది పెట్టాలని భావించడం లేదని.. కానీ కొన్ని ప్రశ్నలను మాత్రం ఆమె ముందుకు వుంచాలనుకుంటున్నానని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే, ఆమెకు కోపం ఎందుకు వస్తోందన్న విషయమై తన వాదనను వినిపించాడు. 
 
మీకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది.. తిరుమలలో పవన్‌తో పాటు దేవుడి ముందు నిలబడి.. ఒకే గోత్ర నామాలతో పవన్, పూనమ్ ఎందుకు పూజ చేయించుకున్నారో చెప్పాలని కత్తి మహేష్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా? లేదా? అంటూ ప్రశ్నలు వర్షం కురిపించాడు. ఈ ప్రశ్నలన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని కత్తి మహేష్ తెలిపాడు.