బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (11:32 IST)

ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలంటున్న గీత రచయిత్రి

సమాజంలో మహిళలు ప్రతిచోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో అనేక మంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులను ఏకరవుపెడుతున్నారు.

సమాజంలో మహిళలు ప్రతిచోటా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో అనేక మంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న వేధింపులను ఏకరవుపెడుతున్నారు. అయితే, తాజాగా ఓ గీత రచయిత్రి కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడించింది. ఈ వేధింపులకు కారణం కూడా ఓ మహిళా దర్శకురాలని చెపుతోంది. 
 
ఆ గీత రచయిత్రి ఎవరో కాదు.. 'పెళ్లి చూపులు', 'అర్జున్‌ రెడ్డి' చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్ఠ. మహిళా గీత రచయితగా తెలుగు సినీ పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 
 
గోవాలో జరిగిన ఓ పార్టీకి తాను రావాలంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకురాలు బలవంతం చేయడంతో తాను ఆ పార్టీకి వెళ్లాననీ, అక్కడ ఓ వ్యక్తిని పరిచయం చేసి అతను 'నిన్ను ప్రేమిస్తున్నాడ'ని చెప్పిందన్నారు. 
 
కానీ అదే వ్యక్తి తనకు ఫోన్‌ చేసి.. ఆ దర్శకురాలు నీ గురించి ఇంకోలా చెప్పిందని చీప్‌గా మాట్లాడటంతో షాక్‌ అయినట్టు చెప్పింది. ఆ దర్శకురాలిని చెప్పుతో కొట్టాలనిపించిందనీ.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయిలను వేధింపులకు గురిచేసేవారిలో మహిళలు కూడా ఉంటారన్న శ్రేష్ఠ మాటలు కలకలం రేపాయి.