శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:55 IST)

భయం అన్నది లేని దయాగుణం కలిగిన వ్యక్తి : హైపర్ ఆది

జబర్ధస్త్ ఫేమ్.. పంచ్ మాస్టర్ హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి మనకు తెలిసిందే. సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు  సందర్భంగా సోషల్ మీడియాలో పంచ్ డైలాగులతో ఇరగదీశాడు హైపర్ ఆది. ట్విట్టర్‌లో అదిరిపోయేలే ట్వీట్ చేశాడు. ఆది ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ముఖ్యంగా పవన్ కల్యాన్ ఫ్యాన్స్ అయితే పుండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆది ఏమని ట్వీట్ చేసాడో తెలుసా
 'ఏమని పిలవాలి ఎంతని చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని పేర్లతో పిలిచిన పవర్ పాస్ అయ్యే ప్లేస్ మాత్రం పవన్ కల్యాణ్ దగ్గర నుంచే' హ్యాపీ బర్త్‌డే పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. 
 
'భయం అన్నది లేని దయాగుణం కలిగిన వ్యక్తి' బంగారం లాంటి లక్షణాలు... దేవుడులాంటి మనసు ఉన్న మనిషి' అంటూ రాసేకొద్ది ఆయన గురించి రాయడానికి ఇంకా ఏదో మిగిలి ఉందనిపిస్తోంది అంటూ ఆ సక్తికరమైన ట్వీట్ చేశాడు హైపర్ ఆది.