గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:03 IST)

ఛార్మికి దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చిన హీరోయిన్...

వరుస ఫ్లాప్‌లతో ఉక్కిరబిక్కిరైన పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో మంచి ఊపు మీదున్నారు. ఈ నేపథ్యంలో డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ కావడంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నట్లు పూరీ ప్రకటించడం తెలిసిందే. మంచి క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే నానా పుకార్లు, భారీ అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాంటి వార్త ఒకటి ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోందట.
 
గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై తాను అన్నీ మాస్ సినిమాలే చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా కోసం మరో మాస్ స్టోరీని సిద్ధం చేసినట్లు, ఇందుకోసం విజయ్ కూడా తన బాడీ లాగ్వేజ్ మార్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. లావణ్య సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ చూసుకోనుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది.
 
ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా ఓ హీరోయిన్‌ను నటింపజేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు.. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అన్ని భాషల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని జాన్వీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ.. ముంబై వెళ్లి జాన్వీ కపూర్‌తో కథ చెప్పినప్పుడు ముందుగా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అమ్మడు పారితోషికంగా రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో షాక్‌కు గురైన ఛార్మీ వెనక్కు తగ్గి చేసేదేం లేక అక్కడి నుంచి వచ్చేసిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.