బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:24 IST)

తమిళ హాస్య నటి మధుమితపై బిగ్ బాస్ నిర్వాహకుల కేసు

తమిళ బిగ్ బాస్ షో నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చిన తమిళ హాస్య నటి మధుమిత. ఆమె హౌస్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కలకలం రేపింది. దీంతో మధుమితపై షో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని వెంటనే ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరిస్తోందని విజయ్ టీవీ నిర్వాహకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చెన్నై నగర పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు నమోదుపై మధుమిత స్పందించారు. తమ మధ్య ఎటువంటి సమస్యా లేదని, తనపై వారు కేసు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని వాపోతోంది. పైగా, తనకు రావాల్సిన పారితోషికాన్ని అడిగానని, వారు బిల్లు పంపమంటే పంపానని తెలిపింది. అంతా సవ్యంగానే ఉందని, కానీ అకస్మాత్తుగా వారు తనపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారో తనకు తెలియదని తెలిపింది. 
 
పైగా, తాను గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాననీ, తాను ఇప్పటివరకు ఎవరితోనూ గొడవపడలేదనీ, అలాగే, ఏ ఒక్కరిపైనా ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. తనపై కేసు పెట్టిన విషయం తెలిసి వెంటనే నిర్వాహకులకు ఫోన్ చేశానని, కానీ వారు స్పందించలేదని మధుమిత తెలిపింది.