శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:52 IST)

గ్లాస్ పట్టుకున్న బిగ్ బాస్ విజేత భార్య...

ప్రముఖ నటుడు, తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ భార్య, నటి మధుమిత జనసేనకు మద్దతుగా తన ఫేస్‌బుక్ పేజీలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ''కంకణం ధరించే ముందు ఒక అభిమానిని అన్న నిజాన్ని పక్కన పెట్టి జనసేన మానిఫెస్టో + పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం మరియు దేశం కోసం ఆయన చేసుకున్న ప్రణాళికలు, ఆయన నిస్వార్ధంగా ప్రజల కోసం కంటున్న కలలు వాటిని సాధించే దిశగా ఆయన చేస్తున్న కృషి ఇవన్నీ విశ్లేషించుకుని నిర్ణయించుకున్నాం. మనలో ప్రతి ఒక్కరు ఒక ప్రచారసాధనంగా మారి ఆయనకి, ఆయన ఆశయాలకు, ఆయన మనపై ఉంచిన నమ్మకానికి ప్రాణం పొయ్యాలని వేడుకుంటున్నాను. ఈ 3 రోజులు మన నాయకుడి కోసం (మన కోసం) అలుపెరగకుండా ఆయనలానే పనిచేద్దాం.'' అంటూ మధుమిత పిలుపునిచ్చారు.
 
'సందడే సందడి' సినిమా ద్వారా 2002లో వెండితెరకు పరిచయమైన మధుమిత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 2009లో నటుడు శివ బాలాజీని ప్రేమ పెళ్లి చేసుకున్నాక, సినిమాలు తగ్గించినప్పటికీ అడపాదడపా సినిమాలలో కనిపిస్తున్నారు. ఈమధ్య విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమాలో రామ్ చరణ్ వదిన పాత్ర పోషించారు.