శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (09:12 IST)

తమిళ బిగ్ బాస్ నటి ఆత్మహత్యాయత్నం....

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్. అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులోనూ ప్రసారమవుతోంది. పైగా, ఇది బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ రియాల్టీ షోకు తమిళంలో హోస్ట్‌గా విశ్వనటుడు కమల్ హాసన్ వ్యవహరిస్తుంటే తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్‌లో నటిస్తున్న మధుమిత అనే నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె ఒరు కల్.. ఒరు కన్నాడి అనే చిత్రంలో హాస్య పాత్రలో నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్‌లో నటిస్తోంది. 
 
గత 50 రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్న మధుమిత... కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణంలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆమెను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు పంపేశారు. సహ పార్టిసిపెంట్స్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడివుంటారనే పుకార్లు వస్తున్నాయి.