సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 13 జులై 2019 (17:28 IST)

మహిళ ఆత్మహత్యా యత్నం... వైసీపి ప్రభుత్వ వేధింపులేనంటూ లేఖ...

వైసీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంచిలీపట్నం 30వ వార్డుకి చెందిన జయలక్ష్మి ఓ లేఖ రాశారు. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా టార్చర్ పెడుతున్నారనీ, మంత్రి పేర్ని నాని, మత్త తులసి తన చావుకు కారణమంటూ వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆమె ఉత్తరం రాసి నిద్రమాత్రలు మింగారు.
 
ఆమెను ఆంధ్ర హాస్పిటల్‌కి తరలించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం అని వైద్యులు చెపుతున్నారు. కాగా ఆమె ఆరోపణలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.