శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 3 ఆగస్టు 2019 (19:40 IST)

బెల్ట్ షాప్‌కు పర్మిషన్ ఇవ్వమని ఆ పని చేసిన మహిళ... అంతా చోద్యం చూశారు...

ఎక్సైజ్ అధికారుల వేధింపులు, కుల సంఘం పెద్దల వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన చావుకు వాళ్ళే కారణమంటూ సుసైడ్ నోటు రాసింది. పురుగుల మందు సేవించి ప్రస్తుతం చావుబతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతోంది.
 
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన లాస్య అనే వివాహిత కొంతకాలంగా కల్లు దుకాణం నడుపుతోంది. బెల్ట్ షాప్ పర్మిషన్ కూడా ఇప్పించాలని గ్రామపెద్దలను కోరింది. అదే గ్రామానికి చెందిన గంగాధర్ కూడా తనకి కూడా బెల్ట్ షాప్ కావాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో అతడు లాస్య ఇంటికి వచ్చి గొడవ చేయగా పోలీసులకు పట్టించారు స్థానికులు.
 
గంగాధర్ తరపున గ్రామపెద్దలు లాస్యకు వార్నింగ్ ఇచ్చారు. కులపెద్దలు కూడా ఏకమైన ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన లాస్య పురుగుల మందు చేతిలో పట్టుకుని గ్రామస్తుల ముందు నిలబడింది. వారు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో వారి ముందే ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తన ఆర్థిక స్థోమత సరిగ్గా లేదని బెల్ట్ షాపుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది లాస్య.