శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 3 ఆగస్టు 2019 (15:52 IST)

కుక్కను పెళ్ళి చేసుకున్న బ్రిటన్ మాజీ సుందరి..

బ్రిటన్‌కు చెందిన మాజీ సుందరి ఎలిజిబెత్ హోడ్ తన పెంపుడు కుక్కను పెళ్లి చేసుకుంది. లాగాన్ అనే శునకానికి వెడ్డింగ్ చైన్ తొడిగింది. తాను లాగాన్‌కు తోడుగా ఉంటానని, ప్రతి రోజు వాకింగ్‌కు తీసుకెళతానని ముచ్చట్లు కుక్కతోనే చెబుతూ ప్రమాణం కూడా చేసేసింది. 
 
ఎలిజిబెత్ హోడ్‌కు తన కుక్కంటే చాలా ఇష్టం. ఆ కుక్క లాగాన్‌ను గాఢంగా ప్రేమించిందట. కుక్కకు విశ్వాసముంటుందని తెలుసుకున్న బ్రిటన్ మాజీ సుందరి దాన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంది. దీంతో తన పెళ్ళిని ఫిక్స్ చేసుకొని మరీ ఒక టివీ ఛానల్‌లో లైవ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
 
బ్రిటన్ మాజీ సుందరి పెళ్ళిని సదరు ఇంగ్లీష్ ఛానల్ లైవ్ కూడా చూపించింది. రెండుగంటల పాటు జరిగిన ఆ వివాహ వేడుకలను బ్రిటన్ ప్రజలు టివీలకు అతుక్కుని మరీ తెగ చూసేశారట.