'బిగ్ బాస్' సీజన్-3లో నయనతార?
బిగ్ బాస్ సీజన్ 3లో కోలీవుడ్ లేడీ అమితాబ్ నయనతార హోస్ట్‌గా నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కాకపోతే తెలుగు కాదండోయ్... తమిళ బిగ్ బాస్ 3కి ఈ అమ్మడు హోస్ట్‌గా వ్యవహరించబోతారా? అనేది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు తమిళనాట ఉన్న తాజా వార్త.
వివరాలలోకి వెళ్తే... స్టార్ విజయ్ టీవీ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షోకి సంబంధించిన గత సీజన్‌లో విశ్వనటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో ప్రారంభంకానున్న బిగ్‌బాస్ 3 సీజన్‌కి... ఇప్పటివరకు సదరు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ, శంకర్ దర్శకత్వంలోని ‘భారతీయుడు 2’తోనూ బిజీగా ఉండడంతో హోస్ట్‌గా ఎవరిని నిర్ణయించాలనే సమస్య వచ్చిపడిందట.
దీనితో ఈ సీజన్‌కి మరెవరైనా ప్రముఖ నటులను బిగ్ బాస్ షోలో నటింపజేసేందుకు నిర్వాహకులు పలువురితో సంప్రదింపులు జరిపారట. ఈ నేపథ్యంలో లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ఈ షోని చేయించేందుకు నిర్వాహకులు సంప్రదింపులు జరిపారు. అయితే నయనతార ప్రస్తుతం దక్షిణాదిన పలు భాషా చిత్రాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదురుతాయో, లేదో వేచి చూడాల్సి వస్తోందంటున్నారు.
ఒకవేళ ఆవిడ నిరాకరిస్తే మాత్రం సూర్య, కార్తీలతో కూడా ఈ షోను నిర్వహించేందుకు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత సమాచారం.