గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (19:08 IST)

బిగ్ బాస్-3 హోస్ట్‌గా బాహుబలి దేవసేన? కమల్ స్థానంలో నయనతార?

బాహుబలి దేవసేన అనుష్క శెట్టి కొత్త అవతారం ఎత్తనుంది. బిగ్ బాస్-3 తెలుగు రియాల్టీ షోకు అనుష్క వ్యాఖ్యాతగా మారనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బాహుబలి సినిమాకు తర్వాత దేవసేనకు వున్న క్రేజ్‌ను బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ 3 వ్యాఖ్యాతగా అనుష్కను ఎంపిక చేసే దిశగా రంగం సిద్ధమవుతుందని టాక్. 
 
త్వరలో ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ 2 సీజన్‌ వ్యాఖ్యాతగా ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున పేర్లు వినిపించాయి. తాజాగా అనుష్క పేరు వినిపిస్తోంది. దీంతో అనుష్క అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 
 
అలాగే తమిళ బిగ్ బాస్‌కు కూడా హీరోయిన్‌ను బరిలోకి దించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తమిళ బిగ్ బాస్‌ షోకు నయనతారను రంగంలోకి దించాలనుకుంటున్నారు. సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ బిజీగా వుండటంతో నయనతార తమిళ బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపిస్తారని టాక్.