శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (10:46 IST)

తమిళ బిగ్ బాస్ నటి ఆత్మహత్యాయత్నం.. హౌస్ నుంచి అవుట్

తమిళ బిగ్ బాస్‌లో ప్రతీసారి ఎవరో ఓ నటి వివాదాస్పద వ్యవహారంలో చిక్కుకుంటుంది. గతంలో ఓవియా హౌస్‌లో మంచి పేరు కొట్టేసినా, హౌస్ మేట్స్ వేధింపుల కారణంగా షో నుంచి అర్ధాంతరంగా వెలుపలికి వచ్చేసింది. ఇదే తరహాలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న హాస్యనటి మధుమితని కూడా హౌస్ నుండి బయటకి పంపించేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. దాదాపు యాభై రోజులకు పైగా హౌస్‌లో ఉన్న మధుమిత కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోన్న సమయంలో శనివారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
 
దీంతో ఆమెని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపేశారు. హౌస్‌లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 
 
అయితే హోస్ట్ కమల్ హాసన్.. మధుమిత చేసిన చర్యపై మండిపడ్డారు. హౌస్‌లో మధుమిత బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మిగిలిందని వ్యాఖ్యానించారు. కవిన్, లాస్యలతో ఏర్పడిన వివాదం.. వనిత రీ ఎంట్రీకి తర్వాత ఏర్పడిన వివాదాలే ఆమె ఆత్మహత్యాయత్నానికి దారితీసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.