చంద్రబాబు ఏమైనా ఒసామా బిన్ లాడినా? : వర్మ క్వశ్చన్
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిమీదకు డ్రోన్లను వదలడంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'తన ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు సీబీఎన్(చంద్రబాబు) ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఆయనేమైనా ఒసామా బిన్ లాడిన్ లాంటివాడా? లేదా తన పెరట్లో ఏదైనా దాచుకున్నాడా? ఊరకనే అడుగుతున్నా' అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
కాగా శుక్రవారం చంద్రబాబునాయుడు ఇల్లు పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు ఇరిగేషన్ శాఖా అధికారులు డ్రోన్లు వదిలిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్ర పూర్వకంగానే చంద్రబాబు ఇంటిమీదకు వరద వదిలారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే వరద ఉదృతి నేపథ్యంలో శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏపీ సర్కారు హై అలెర్ట్‌ను ప్రకటించింది.