శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2019 (10:37 IST)

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. ప్రమాదంలో మాజీ సీఎం చంద్రుడి నివాసం

పులిచింతల నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ప్రమాదంలో పడింది. కృష్ణా కరకట్ట నీరు పెరగడంతో ఇప్పటికే పలు నిర్మాణాల్లోకి వరద నీరు వచ్చి చేసింది.


దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసం కూడా ప్రమాదంలో పడింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. దీనిని ఆనుకుని నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. 
 
చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. పులిచింతల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. 
 
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. 
 
పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. 
ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.