గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (13:16 IST)

యూఎస్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గత శనివారం ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మిన్నెసోటా రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 
 
తిరిగి వచ్చే రోజు ఆయన తనను కలవడానికి వచ్చిన కొందరు ప్రవాసాంధ్రులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. మొక్కజొన్న పేలాలు తింటూ స్థానిక వీధుల్లో సరదాగా నడిచారు. కాసేపు షాపింగ్‌ చేశారు. రెస్టారెంట్లో వారితో కలిసి రాజకీయాలు, ఇతర అంశాలు మాట్లాడారు. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి తదితరులు ఉన్నారు.