ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (12:44 IST)

బాసర ఐఐఐటి కి అంతర్జాతీయ అవార్డు

బాసర ట్రీపుల్​ఐటీ కళాశాలకు ఇండియా మోస్ట్​ ట్రస్టెడ్​ ఎడ్యుకేషన్ అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ ​బ్రాడ్​కాస్టింగ్ ​కార్పొరేషన్(యూఎస్) అందించిన కంజూమర్​రీసెర్చ్​ రిపోర్టు ఆధారంగా అవార్డు కేటాయించారని ఇన్​చార్జ్​ వీసీ అశోక్​కుమార్ చెప్పారు. 
 
13 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతిక విద్య అందించడం, అత్యున్నత స్థాయి వసతులు, ఇంటర్నేషనల్​ లెవల్​ ప్రయోగశాలలు నెలకొల్పడం, వర్సిటీలో 68 శాతం విద్యార్థినులకు సాంకేతిక విద్య అందించడం తదితరార అంశాలను అవార్డు కేటాయింపులో పరిగణలోకి తీసుకున్నారని వివరించారు. ఈ అవార్డును ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.