శ్రీ పంచమి రోజున ఇలా చేయడం మరిచిపోకండి..

Last Updated: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:35 IST)
మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ పంచమిని జరుపుకుంటారు. ఈ పండుగ ఆదివారం (ఫిబ్రవరి 10, 2019)న వస్తోంది. శ్రీ పంచమిని విద్యారంభదినంగా భావిస్తారు. మన రాష్ట్రంలోని క్షేత్రంలోనూ ఇతర సరస్వతీ దేవాలయాలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతి. ఆమె జ్ఞాన స్వరూపిణి. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకగా భావిస్తూ ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహిస్తారు.
 
శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. మాఘ శుక్ల పంచమి నాడు, విద్యారంభం నాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబా ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి.
 
తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్లవస్త్రాలతో అర్చించాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మవారిని పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న తదితర పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత చిన్నారులకు విద్యారంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు.
 
ఇంకా వసంత పంచమి అని పిలువబడే శ్రీ పంచమి రోజున కేసర్ హల్వా, పంచదార, పిండితో చేసిన వంటకాలు, కుంకుమ పువ్వు, యాలకులు, పెన్నులు, పుస్తకాలను వుంచి పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దీనిపై మరింత చదవండి :