శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (19:00 IST)

నా డార్లింగ్ నయనతారనే... చెప్పిందెవరో తెలుసా? సాహో హీరో..! (video)

''సాహో'' విడుదలై బంపర్ కలెక్షన్లను కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ''సాహో'' తమిళ వెర్షన్ ప్రమోషన్‌లో బాహుబలి స్టార్, సాహో కింగ్ ప్రభాస్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం వున్న హీరోయిన్లలో మీకు నచ్చే హీరోయిన్ ఎవరో చెప్పమని.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు డార్లింగ్ సమాధానం ఇచ్చాడు. తనకు నయనతారంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. 
 
వెండితెరపై ఆమె కనిపించే తీరు తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు. నటనలో ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాలని.. ఆమె అభినయం తనకు బాగా నచ్చుతాయని ప్రభాస్ తెలిపాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'యోగి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో' ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాహుబలితో అం‍తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగింది. 
 
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ''సాహో'' అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందించారు. హాలీవుడ్‌కు ధీటుగా కలెక్షన్లతో పాటు సాహో కొత్త కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది.