సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (10:25 IST)

హ్యాపీ #GaneshChaturthi - #HappyBirthdayPawanaKalyan

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అనేక మంది సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా, పవన్ ఫ్యాన్స్ ఈ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 
 
ఇదే అంశంపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ ట్వీట్ చేశారు. "వెండి తెర నా మీద ప్రకాశించు అని వేడుకుంటున్నా వినకుండా, వినిపించిన పేదవాడి ఆక్రోశానికి స్పందించి, ప్రజల కోసం ప్రశ్నించడానికి జనం మధ్యకు వెళ్లి, జనసేనాని అయిన పవన్ కళ్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. 
 
ఇదిలావుంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది హిందువుల తొలి పండుగ అని, తలచిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రార్థించే వేడుక అని తెలిపారు. పర్యావరణానికి హాని చేయకుండా పండుగ జరుపుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. 
 
నివాసాల్లోనూ, మంటపాల్లోనూ మట్టి విగ్రహాలనే వినియోగించాలని సూచించారు. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వినాయకుడ్ని పూజించే ప్రతి ఒక్కరికీ తన తరపున, జనసైనికుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.