సంబంధిత వార్తలు
- సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి
- RPF: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పల్లబికి జీవన్ రక్ష పదక్ 2024 అవార్డ్.. ఎందుకో తెలుసా? (video)
- ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1
- విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు
- అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్
జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్
Jeeva,Rashee Khanna
జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలను దర్శకుడు బలంగా స్పృశిస్తున్నారు. మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరికొంత సమయం కేటాయించాలని భావించిన మేకర్స్.. సినిమా విడుదలను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి పోస్ట్ పోన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ అగత్యా సరికొత్త అనుభూతిని అందిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
