బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జనవరి 2025 (18:29 IST)

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో కిల్లర్ పార్ట్ 1

Killer Part 1
Killer Part 1
"శుక్ర", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
 
"కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో లీడ్ ఆర్టిస్టులంతా పాల్గొంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ తాజా షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమాను రూపొందుతోంది. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా "కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ సినిమా ప్రేక్షకులకు మెమొరబుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుంది.