1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (08:41 IST)

ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది: అరవింద్ కృష్ణ

Arvind Krishna,  Jyoti Purvaj  and others
Arvind Krishna, Jyoti Purvaj and others
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్  రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ  "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ - మనం వరల్డ్ సినిమాలోని ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం. నాకూ చాలా సూపర్ హీరోల సినిమాలు ఇష్టం. ఆ సూపర్ హీరో క్యారెక్టర్ కు మన పురణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను ప్రారంభించాను. ఇందులో మన మైథాలజీ సోల్ ఉంటుంది. భాగవతంలోని జయ విజయుల నేపథ్యంతో హీరో, విలన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే మా పోస్టర్ లో మిథ్స్ రీఇమాజిన్ డ్ అని రాశాం. చిన్న ప్రాజెక్ట్ గా "ఏ మాస్టర్ పీస్" మూవీ మొదలైంది. సినిమా షూటింగ్ ప్రాసెస్ బిగ్ స్కేల్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మనీష్ గిలాడ, సినిమా బండి ప్రొడక్షన్స్ శ్రీకాంత్  నిర్మాణంలో యాడ్ అయ్యారు. హాలీవుడ్ మూవీస్ కు పోస్ట్ ప్రొడక్షన్ చేసే మెర్జ్ ఎక్స్ ఆర్ మా టీమ్ లో జాయిన్ అయ్యింది. వాళ్లు చేసిన వీఎఫ్ఎక్స్ మీకు అద్భుతమైన ఫీల్ కలిగిస్తాయి. ఈ జర్నీలో హీరో అరవింద్ కృష్ణ, నిర్మాత మనీష్ గిలాడ, ప్రొడ్యూసర్ శ్రీకాంత్, మెర్జ్ ఎక్స్ ఆర్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మనీష్ గిలాడ లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్ లో వచ్చేది కాదు. అరవింద్ కృష్ణ నాకు బ్రదర్ లాంటివాడు. సూపర్ హీరో సినిమా మరో పెద్ద హీరోను ట్రై చేయొచ్చు కదా అని కొందరు అన్నారు. అరవింద్ లాంటి పర్సనాలిటీ ఉన్న హీరోనే సూపర్ హీరోగా ఇమాజిన్ చేసుకున్నాను. నా వైఫ్ జ్యోతి పూర్వజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. పది రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. మేకింగ్ లో నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్ మూవీ. రిలీజ్ అప్డేట్ ను త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.
 
నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ప్రారంభమైనప్పుడు సుకు ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నేను ప్రాజెక్ట్ లోకి వచ్చాను. తెలుగులో మా సినిమా బండి బ్యానర్ మీద ఒక ప్రాపర్ సూపర్ హీరో సినిమా చేయాలని ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశాం. ఒక టైమ్ లో మూవీని మరో స్కేల్ కు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మనీష్ చాలా సపోర్ట్ చేశాడు. అరవింద్, మనీష్ ఇద్దరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్లు. మా మూవీ టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా పనిచేశాం. నేను యూఎస్ లో ఉంటూ ఈ ప్రాజెక్ట్ చూసుకోలేనని పూర్తిగా మనీష్ మీద వదిలేశాను. మనీష్ కోసమే గోవా నుంచి ఈ టీజర్ లాంఛ్ కు వచ్చాను. ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ కావాల్సివచ్చినప్పుడు మెర్జ్ ఎక్స్ ఆర్ నుంచి ప్రజయ్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో 1500కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. మెర్జ్ ఎక్స్ఆర్ రీజనల్ హెడ్ యోగికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - సీరియల్స్ ద్వారా నేను మీకు పరిచయమే. "ఏ మాస్టర్ పీస్" సినిమాతో నటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. సుకుతో నా మ్యారేజ్ జరిగింది. అప్పటినుంచి టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయింది. "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ చూశారు మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దర్శకుడు సుకు నా మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పారు. ఈ మూవీ టీమ్ అంతా ఫ్యామిలీలా మారిపోయారు. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా గురువు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఆయనకు సినిమానే లోకం. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. అరవింద్ కృష్ణ ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. మనీష్ గారు లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాత శ్రీకాంత్ గారికి జ్యోతి గారికి ఇతర టీమ్ మెంబర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. మనీష్ నేను కాలేజ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రిన్సిపాల్ రూమ్ లో చూసిన తర్వాత ఇదే వేదిక మీద మా పేరెంట్స్ మమ్మల్ని చూడటం. మేము ప్రయోజకులం అయ్యామని చెప్పేందుకే మా పేరెంట్స్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. మనీష్ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతాను. నాకు జీవితంలో ప్రతిసారీ వాడే ఇస్తున్నాడు వాడే సపోర్ట్ చేస్తున్నాడు. నేను వాడికి చేసిందేం లేదు. ఇప్పుడు కూడా నాకోసమే ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. మనీష్ నీకోసం ఏదైనా మంచి పని చేయాలని, నువ్వు గర్వపడేలా నేను ఉండాలని అనుకుంటున్నా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. సుకు పూర్వజ్ నాకు గురూజీ లాంటి వాడు. నేను సినిమాలు వదిలేసిన టైమ్ లో నీలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఆయన డైరెక్షన్ లో శుక్ర మూవీ చేశాను. సుకుకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయన నాతో మూవీ డిస్కషన్స్ లో ఉన్న టైమే ఎక్కువ. జ్యోతికి ఇది కోపం వచ్చే విషయమే. కొద్ది రోజులు అయితే మీ ఆయనను మీకు ఇచ్చేస్తాం. ఆత్మవిశ్వాసంతో మూవీ ఔట్ పుట్ చూసి చెబుతున్నాను. "ఏ మాస్టర్ పీస్" సినిమా మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. అన్నారు.