సంబంధిత వార్తలు
- మరోసారి అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎన్.టి.ఆర్.
- వరల్డ్ వైడ్‌గా 304 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో 80 శాతం రికవరీ సాధించిన చిత్రం దేవర
- దేవర రిలీజ్.. సుదర్శన్ థియేటర్లో అగ్ని ప్రమాదం.. కటౌట్ దగ్ధం (video)
- ఎన్టీఆర్ తో కొరటాల శివ దేవర తో సక్సెస్ ఇచ్చాడా? లేదా? . దేవర రియల్ రివ్యూ
- జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?
ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్
'దేవర' చిత్ర దర్శకుడు కొరటాల శివపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కొరటాల శివ ఇపుడు మా కుటుంబ సభ్యుడిగా మారిపోయారు అని అన్నారు. కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర'. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.396 కోట్ల మేరకు కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో చిత్ర సక్సెస్ మీట్‌ను తాజాగా ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించారు. ఇందులో చిత్ర బృందంతో పాటు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'బృందావనం' చిత్రంతో మా ప్రయాణం మొదలైంది. ఇప్పుడాయన నా కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. "దేవర-2" చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని అన్నారు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ, నాకు, కళ్యాణ్ రామ్ అన్నయ్యకు హరికృష్ణ కొసరాజు వెన్నెముకలాంటివారు. ఆయన వల్లే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది అని పేర్కొన్నారు.
