1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kamal Haasan comments on Gautami announces split

గౌతమి - సుబ్బు సంతోషంగా ఉంటే చాలు.. బ్రేకప్‌పై పెదవి విప్పిన కమల్ హాసన్

గత 13 యేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన నటి గౌతమి... తనతో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించడంపై హీరో కమల్ హాసన్ స్పందించారు. నా కలల హీరో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు నటి గౌతమి మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్ర

Kamal Haasan
గత 13 యేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన నటి గౌతమి... తనతో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించడంపై హీరో కమల్ హాసన్ స్పందించారు. నా కలల హీరో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు నటి గౌతమి మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇందులో అనేక విషయాలను వివరించారు. కానీ ఎందుకు విడిపోతున్నరనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
 
ఇదిలావుంటే, తమ బ్రేకప్ వ్యవహారంపై కమల్‌ హాసన్ స్పందించారు. గౌతమికి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండాలని, తన ఆనందమే కోరుకుంటున్నట్లు ప్రకటించారు. గౌతమి తీసుకున్న నిర్ణయానికి, తన మనోభావాలను ముడిపెట్టడం సరికాదన్నారు. 
 
గౌతమి, సుబ్బు సంతోషంగా ఉంటే చాలన్నారు. తను ఎక్కడున్నా ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. దేవుడు తనకు శ్రుతి, అక్షర, సుబ్బులక్ష్మి‌లను కూతుళ్లుగా ఇవ్వడం అదృష్టమన్నారు. ప్రపంచంలో అదృష్టవంతుడైన తండ్రిని కావడం సంతోషంగా ఉందన్నారు.
About Writer
pnr
తర్వాతి కథనం
యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో సాహసం శ్వాసగా సాగిపో ట్రైలర్... (video)