రక్తం వృద్ధి చేసే అద్భుత ఆహారాలు
రక్తంలో ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. అయితే, సరైన ఆహార నియమాలతో చాలా వేగంగా రక్తం పట్టేలా చూసుకోవచ్చు. ఐరన్ త్వరగా పెరగాలంటే కేవలం ఐరన్ ఉన్న ఆహారాలు తినడమే కాదు, అది శరీరానికి అబ్బేలా చూసుకోవడం కూడా ముఖ్యం. రక్తం సత్వరమే పట్టడానికి మీరు తీసుకోవలసిన ఉత్తమ ఆహారాల జాబితా ఏమిటో తెలుసుకుందాము.
మునగాకు & తోటకూర- ఆకుకూరల్లో మునగాకు ఐరన్‌కి పవర్‌హౌస్ వంటిది. పాలకూర, తోటకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
ఖర్జూరం & ఎండు ద్రాక్ష- రోజుకు 2-3 నల్ల ఖర్జూరాలు లేదా గుప్పెడు నల్ల ఎండు ద్రాక్షలు తింటే హిమోగ్లోబిన్ చాలా వేగంగా పెరుగుతుంది.
బీట్‌రూట్ & దానిమ్మ- ఇవి ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. వీటిని జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా ముక్కలుగా తింటే ఎక్కువ ఫైబర్, ఐరన్ అందుతాయి.
నల్లనువ్వులు & బెల్లం నల్లనువ్వులను వేయించి బెల్లంతో కలిపి లడ్డులా చేసుకుని రోజు ఒకటి తింటే ఐరన్ లోపం త్వరగా తగ్గుతుంది.
మటన్ లివర్ & గుడ్లు- మీరు మాంసాహారులైతే.. వారానికి ఒకసారి లివర్ తినడం వల్ల శరీరానికి 'హీమ్ ఐరన్' అందుతుంది. ఇది ప్లాంట్ ఐరన్ కంటే చాలా వేగంగా శరీరంలోకి శోషించబడుతుంది.
