1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Knee Surgery success to Balakrishna

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు మేజర్ సర్జరీ

హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ చేశారు. ఆయన నటించిన చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'. ఈ సినిమా షూటి

Hero Balakrishna
హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయనకు ఈ ఆపరేషన్ చేశారు. ఆయన నటించిన చిత్రం 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పటి నుంచి రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. 
 
ఆ తర్వాత 'పైసా వసూల్', 'జై సింహా' వంటి చిత్రాలకు ణుందుగానే కమిట్ కావడంతో సర్జరీ చేయించుకోలేక పోయారు. పైగా, ఇంతకాలం తాత్కాలిక చికిత్సతో నెట్టుకొచ్చిన ఆయన... ఇపుడు శాశ్వత పరిష్కారం కోసం చికిత్స చేసుకున్నారు. 
 
ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌కృష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కి చేరుకున్నారు. వెంట‌నే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ (పూణే)ల సారథ్యంలోని వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్జరీ దాదాపు గంట‌సేపు జ‌రిగినట్టు వైద్యులు వెల్లడించారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు : లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి