సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (17:14 IST)

బాలకృష్ణ 'జై సింహా' గర్జన... మూడు రోజుల వసూళ్లు!

సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.11.75 కోట్ల షేర్‌ను .. రూ.17.5 కోట్ల గ్రా

సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.11.75 కోట్ల షేర్‌ను .. రూ.17.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, రూ.13.9 కోట్ల షేర్‌ను.. రూ.22.9 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
 
ఈ సినిమాకంటే రెండు రోజులు ముందుగా వచ్చిన 'అజ్ఞాతవాసి' అభిమానులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్లపరంగా బాగానే వసూలు చేస్తోంది. 'జై సింహా'తో పాటే విడుదలైన 'గ్యాంగ్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'జై సింహా' తర్వాత వచ్చిన 'రంగుల రాట్నం' కూడా ఆశించిన స్థాయిలో యూత్‌ను అలరించలేకపోయింది.