సంబంధిత వార్తలు
- ఇంట్లో కట్టేసిన కుక్కలమో.. బర్రెలమో కాదు.. మీడియాకు జీవిత వార్నింగ్
- మా వివాదం : డైరీ ఆవిష్కరణలో రచ్చ.. చిరంజీవిని టార్గెట్ చేసిన రాజశేఖర్
- అప్పులు తీసుకోండి.. పెట్టుబడులు పెట్టుకోండి.. ఎస్.బి.ఐ
- అసభ్యంగా వేధిస్తున్నారు.. 'దిశ' తనతోనే మొదలుపెట్టాలి : ఎర్రన్న కుమార్తె
- బాబుకు దుగ్ద ఎక్కువైంది... మేనిఫెస్టో మాకు బైబిల్ : సీఎం జగన్
తెలుగు ఇండస్ట్రీని చూసి వణికిపోతున్నారు : కృష్ణంరాజు
ఒకపుడు భారత చలన చిత్రపరిశ్రమను బాలీవుడ్ ఇండస్ట్రీ శాసించిందనీ, ఇపుడు తెలుగు ఇండస్ట్రీని చూసి ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని రెబల్ స్టార్ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కృష్ణంరాజు పాల్గొని ప్రసంగించారు. తాము చెన్నైలో తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామని, దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఇపుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పేరిట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకపుడు సినీ ఇండస్ట్రీని బాలీవుడ్ శాసించిందనీ, ఇపుడు టాలీవుడ్ ఆ స్థాయికి చేరుకుందన్నారు. ఎందుకంటే... తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక హీరోలు ఇంటర్నేషనల్ స్థాయికి చేరగా, మరికొందరు బాలీవుడ్ రేంజ్‌కు ఎదిగారన్నారు. బాహుబలి, సాహో, సైరా వంటి చిత్రాలతో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. అందువల్ల తెలుగు సినీ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్లిందన్నారు.
అలాగే, ఈ సభలో జరిగిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయని, తమవంటి పెద్దలను పిలిచి సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. వివాదాలను బహిర్గతం చేసుకోరాదని, 'మా' గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. వివాదాల పరిష్కారం కోసం ఓ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు.
