అప్పులు తీసుకోండి.. పెట్టుబడులు పెట్టుకోండి.. ఎస్.బి.ఐ
అప్పులు తీసుకోండి.. పెట్టుబడులు పెట్టుకోండి అని భారతీయ స్టేట్ బ్యాంకు ఛైర్మన్ రజ్నీశ్ కుమార్ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అప్పు తీసుకోండి.. ఆపై పెట్టుబడులు పెట్టుకోండి అని అన్నారు.
బ్యాంకుల వద్ద నిధులకు కొదువే లేదని, వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా మరిన్ని బ్యాంకులు ఆర్థికంగా పరిపుష్ఠం కానున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బ్యాంకుల వద్ద రుణాలు పొంది, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమకు సూచించారు. దీనివల్ల రుణ పరపతి పెరుగుతుందని సలహా ఇచ్చారు.
ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని అందుకోవాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. నేడు బ్యాంకింగ్ క్రెడిట్ పరిమాణం రూ.96 లక్షల కోట్లుగా ఉన్నది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనకు ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉంది అన్నారు.