సంబంధిత వార్తలు
- విలన్ పాత్ర వల్లే సామర్థ్యం తెలుస్తుందిః లావణ్య త్రిపాఠి
- సుందరకాండ పారాయణం అత్యంత ఫలదాయకం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
- పాయింట్ మిస్ అవ్వకూడదని 'చావు కబురు చల్లగా` చేశాః బన్నీ వాసు
- 'ఏ1 ఎక్స్‌ప్రెస్`లో సిక్స్ ప్యాక్ సందీప్‌కిషన్‌కు లవ్ వ్యక్తం చేసిన లావణ్య
- మైనేమ్ ఈజ్ రాజు `చావుకబురు చల్లగా` చెబుతా ప్రతిరోజు అంటోన్న కార్తికేయ
ఈ సినిమా కోసం ఆ పని చేశా : లావణ్య త్రిపాఠి
యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన తాజా సినిమా "ఏ1 ఎక్స్‌ప్రెస్". ఈ సినిమా చిత్రీకరణ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. హాకీ నేపథ్యంలో నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి డిన్నిస్ జీవన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం గురించి హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండనుందని ఆమె అన్నారు. 'ఏ1 ఎక్స్‌ప్రెస్ రీమేక్ సినిమా అయినప్పటికీ అనేక మార్పులు జరిగాయి. దాదాపు యాభై శాతం స్క్రిప్ట్ మారింది. ఈ సినిమా కోసం నేను కూడా హాకీ నేర్చుకున్నారు.
హాకీ కనిపించినంత తేలిక కాదు, చాలా కష్టం. ఈ సినిమా కోసం నేను తీవ్ర జ్వరంలో ఉన్నప్పుడు కూడా షూటింగ్‌కు హాజరు అయ్యాను' అని లావణ్య తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు.
