మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (19:46 IST)

పాయింట్ మిస్ అవ్వకూడదని 'చావు కబురు చల్లగా` చేశాః బన్నీ వాసు

bunny vasu, kartikeya, lavanya, kowsik,
`భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం` వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం చావు కబురు చల్లగా. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. చిత్ర యూనిట్ ఈ సినిమా మొదటి సాంగ్ 'కదిలే కళ్లనడిగా' విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
చిత్రం కౌశిక్ మాట్లాడుతూ, క‌థ‌కు తగ్గట్లు చావు కబురు చల్లగా అనే టైటిల్ ను లాక్ చెయ్యడం జరిగింది. హీరో డెడ్ బాడీస్ ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్ గా, హీరోయిన్ నర్స్ గా కనిపిస్తుంది. ఇదొక లవ్ స్టొరీ, సీరియస్ పాయింట్ ను ఎంటర్టైన్ వేలో చెప్పడం జరిగింది. సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ఆడియన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిపారు.
 
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, కథ పరంగా మంచి సినిమా చెయ్యాలని అనుకుంటున్న సమయంలో కౌశిక్ చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఫ్రెష్ కంటెంట్ తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశాను. ఎడిటింగ్ రూమ్ లో సినిమా చూసిన తరువాత చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్నది అనుకున్నట్లుగా డైరెక్టర్ సినిమా తీశారు. కార్తికేయ, లావణ్య ఇద్దరూ ఈ కథకు పూర్తి న్యాయం చేశారు. యంగ్ టీమ్ చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
 
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ, ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్ లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్స్ టు బన్నీ వాసు గారు. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారని అన్నారు.
 
కార్తికేయ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటీవ్ వైబ్రేషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ చెప్పింది నేను చేశాను, తాను క్లారిటీతో సినిమా తీసాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉందని తెలిపారు.