మైనేమ్ ఈజ్ రాజు `చావుకబురు చల్లగా` చెబుతా ప్రతిరోజు అంటోన్న కార్తికేయ
Karthi keya, Chavukaburu challage
కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం "చావు కబురు చల్లగా`. టైటిల్‌లోనే కథేమిటో తెలిసీ తెలియనట్లుండగా, శనివారంనాడు మొదటి పాట విడుదల చేశారు. `మైనేమీ ఈజ్‌రాజు. బస్తీబాలరాజు చావుకబురు చల్లగా చెబుతా ప్రతిరోజూ.. అంటూ వేదాంత ధోరణి కలగలిపిన పాటను చిత్ర యూనిట్ బయటకు వదిలింది. ఇందులో తను తన గేంగ్‌తో డాన్స్ చేస్తూ కార్తీక్ కనిపిస్తాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహిస్తుండగా బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజర్ గ్లిమ్ప్స్ కి కూడా అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ ట్యూన్ చేసిన మై నేమ్ రాజు అంటూ సాగే బస్తీ బాలారాజుగా హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్ ని రేవంత్ పాడగా, కరుణాకర్ అడిగర్ల సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాలో బస్తీబాలరాజు అనే క్యారెక్టర్ లో కార్తికేయ లుక్స్ కి, నేపథ్యానికీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆకట్టుకుంటుందని చిత్రం బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, సినిమాను అన్ని వర్గాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగ్ సాంగ్ మై నేమ్ ఈజ్ రాజు కూడా సినీ అభిమానుల్ని అలరిస్తోందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ ఇటు పాటలుకి అద్భుతమైన ట్యూన్స్ ఇస్తూనే అటు నేపథ్య సంగీతానికి పెద్ద పీఠ వేస్తూ చక్కటి అవుట్ పుట్ ఇస్తున్నారు. జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో "100% లవ్", "భలేభలే మగాడివోయ్", " గీతగోవిందం", "ప్రతిరోజు పండగే" చిత్రాలు ఘన విజాయాలు సాధించాయి. ఆ లెగసినీ సక్సెస్ ఫుల్ గా చావుకబురుచల్లగా ముందుకు తీసుకువెళుతుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.