గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (21:07 IST)

మా ఎన్నికల్లో మంచు విష్ణు జయకేతనం.. ప్రకాష్ రాజ్‌కు షాక్

మా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచినవారి జాబితాను బయటకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. దీంతో ప్రకాష్ రాజ్‌కు షాక్ తప్పలేదు. దీంతో ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సిని'మా'సమరం ముగింపుదశకు వచ్చేసింది. 
 
చివరి వరకు ప్రకాష్ రాజ్ కూడా పోటీ ఇచ్చినట్లే కనిపించినా కూడా.. చివరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ఈయన వైపే మా సభ్యులు ఎక్కువగా మొగ్గు చూపారు. ప్రకాష్ రాజ్‌ను నటుడిగా ఆదరించినా కూడా.. అధ్యక్షుడిగా మాత్రం చూడలేమని ఓపెన్‌గానే చాలా మంది చెప్పారు. ప్రస్తుతం ఇదే నిజమైంది.