నాగ చైతన్య NC 22 మైసూర్ కీలక షెడ్యూల్ పూర్తి
Naga Chaitanya
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా మైసూర్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని అందమైన లొకేషన్లలో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం.
ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించనున్నారు. నాగచైనత్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా NC22 తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. స్టార్ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. బ్రిలియంట్ సినిమాటోగ్రాఫర్ ఎస్ఆర్ కతీర్ ఈ చిత్రానికి కెమరామెన్ గా పని చేస్తున్నారు.
