1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. NTR announced that Dragon will be released at the scheduled time

NTR Update: డ్రాగన్ అనుకున్న టైంకే రిలీజ్ అని ప్రకటించిన ఎన్.టి.ఆర్.

NTR and Prashanth neel
NTR and Prashanth neel
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల 'డ్రాగన్' చిత్రం 11 జూన్ 2027 నుండి వాయిదా పడిందన్న వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. ఎన్టీఆర్ అక్టోబర్ 10 నుండి షూటింగ్ లో చేరనుండగా, ఈ చిత్రం అనుకున్న ప్రకారమే కొనసాగుతుందని ఖరారైంది. మొదటి భాగంలోని ప్రధాన భాగాలతో పాటు, రెండవ భాగంలోని ముఖ్యమైన భాగాలను కూడా చిత్రీకరిస్తూ, ఫిబ్రవరి వరకు షూటింగ్ కొనసాగించాలని ప్రణాళిక వేసినట్లు సమాచారం.
 
ప్రస్తుతానికి, ఈ చిత్రాన్ని చూడటానికి 11 జూన్ 2027 విడుదల తేదీగా ఖరారు చేయబడింది. ఈ విషయాన్ని గత రాత్రి ఎన్.టి.ఆర్. తేటతెల్లం చేశారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్ర ప్రమోషన్ లో హాజరైన ఆయన మాట్లాడుతూ, . ‘‘గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది. కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం.

అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా  శశాంక్ మొదటి సినిమా ఈ  డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ సినిమా ఆయనకు గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నా. కార్తికేయ ఈ రోజు నిర్మాతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా ఉంది. మా జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ట్రిపులార్, బాహుబలి సినిమాల వెనుక మా తమ్ముడు కార్తికేయనే ఉన్నాడు. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Srivishnu: కామ్రేడ్ కళ్యాణ్ రివల్యూషనరీ సాంగ్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి