అమెజాన్ ప్రైమ్ ఆదరణలో పరిగెత్తు పరిగెత్తు
parigettu parigettu
నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించుకున్న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. మా సినిమా కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి తో ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా నిర్మిస్తాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు.
దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సినిమా అందరికి ఇంత బాగా నచ్చడం సంతోషంగా ఉంది. నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. ధియేటర్ లలో సినిమాలు విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో మా సినిమా ను ధియేటర్ లలో విడుదల చేసి ధైర్యం చేశాము. ప్రేక్షకులు కూడా సినిమాను చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా మా సినిమా కి మంచి పేరొస్తుంది. నేను ఇంత మంచి సినిమా చేయడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.
