1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Pooja Hegde dubbing for Most Eligible Bachelor

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం డబ్బింగ్ చెబుతున్న పూజాహెగ్డే

Most Eligible Bachelor
Pooja Hegde
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో త‌న పాత్ర కోసం డబ్బింగ్ చెబుతున్నారు పూజ హెగ్డే. తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో అద్భుతమైన స్పష్టతతో డబ్బింగ్ చెబుతున్నారు. ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్యే విడుదలైన లెహరాయి పాటకు కూడా యూ ట్యూబ్ లో అనూహ్య స్పందన వస్తోంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు. 
 
అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేశారు. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు. అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. 
తర్వాతి కథనం
డేగల బాబ్జీ గా ప్రేక్షకుల ముందుకు రానున్న బండ్ల గణేష్