సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:59 IST)

డేగల బాబ్జీ గా ప్రేక్షకుల ముందుకు రానున్న బండ్ల గణేష్

Degala Babji
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి 'డేగల బాబ్జీ' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం కనులు మాత్రమే కనిపించేలా ముఖానికి కండువాతో కవర్ చేసిన బండ్ల గణేష్ కనిపిస్తుంటే ఆయన కన్నుపై కత్తిగాటు, దానిపై వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టు సినిమాపై ఆసక్తి పెంచేలా ఉంది. టైటిల్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.
 
వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై 'డేగల బాబ్జీ' సినిమాను స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభమైంది. శరవేగంగా సన్నివేశాలను తెరకెక్కించారు.
 
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ "తమిళ హిట్ 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కి‌ రీమేక్ ఇది. తమిళంలో ఆర్. పార్తిబన్ పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో పాత్ర కోసం ఆయన పత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'డేగల బాబ్జీ' టైటిల్‌కూ మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం" అని చెప్పారు.
 
ఈ చిత్రానికి ఈ చిత్రానికి కళా దర్శకత్వం: గాంధీ, ఛాయాగ్రహణం: అరుణ్ దేవినేని, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: లైనస్ మధిరి, పి ఆర్ ఓ : నాయుడు - ఫణి ( బియాండ్ మీడియా ), నిర్మాణ - పర్యవేక్షణ  : ముప్పా అంకమ్మరావు, దర్శకత్వం: వెంకట్ చంద్ర, నిర్మాణం: స్వాతి చంద్ర.