1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rajinikanth shooting disturbance

రజనీకాంత్ షూటింగ్‌కు అంతరాయం

చెన్నై నగరాన్ని వణకించిన వార్థా తుఫాను దెబ్బ రజనీకాంత్, శంకర్‌ సినిమా 'రోబో 2'పై పడింది. ప్రస్తుతం చిత్రీకరణ కోసం చెన్నై లోని ఈవిపి ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్‌ వేశారు. కొంతభాగం ఓపెన్‌ ఏరియాలో కూడా వేశారు. ఈ సెట్టింగ్‌ అంతా తుఫాన్‌ ధాటికి బాగా దెబ్బత

Rajinikanth shooting disturbance
చెన్నై నగరాన్ని వణకించిన వార్థా తుఫాను దెబ్బ రజనీకాంత్, శంకర్‌ సినిమా 'రోబో 2'పై పడింది. ప్రస్తుతం చిత్రీకరణ కోసం చెన్నై లోని ఈవిపి ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్‌ వేశారు. కొంతభాగం ఓపెన్‌ ఏరియాలో కూడా వేశారు. ఈ సెట్టింగ్‌ అంతా తుఫాన్‌ ధాటికి బాగా దెబ్బతింది. దీంతో ఇప్పటికే జరగాల్సిన చిత్రీకరణ కాస్త వాయిదా పడిందని తెలిసింది. 
 
యూనిట్‌ సమాచారం ప్రకారం సెట్‌ కొంతవరకు దెబ్బతిన్న మాట నిజమేనని, కానీ దానివలన పెద్దగా నష్టమేమీ జరగలేదని కాకపోతే శుక్రవారానికి వాయిదా పడిందని తెలుస్తోంది. కాగా, ఈ షెడ్యూల్‌ 19వ తేదీ వరకు జరగనుంది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రాన్ని వచ్చే దీపావళికి రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నాడు దర్శకుడు శంకర్‌. ఏ.ఆర్‌ రహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు.
About Writer
DV
తర్వాతి కథనం
'సింగం 3' వాయిదా... సూర్య వివరణ...