సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (18:57 IST)

కనిహాకు ఏమైంది.. గాయపడిందా... అలా నడుస్తుందేంటి?

Kaniha
Kaniha
ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం సీరియల్ నటిగా వున్న కనిహా ప్రస్తుతం నడవలేని పరిస్థితిలో వుందని తెలుస్తోంది. హీరోయిన్ కనిహ రవితేజ, భూమికలతో కలిసి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో నటించింది.
 
ఈ సినిమా కంటే ముందు సత్తిబాబు తెరకెక్కించిన ఒట్టేసి చెబుతున్న సినిమాలో కూడా శ్రీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఆపై ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో మలయాళం, కోలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో కనిపించింది. 
 
తాజాగా బుల్లితెర నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈమె ప్రస్తుతం గాయపడినట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కనిహ.. వాకర్ పట్టుకుని నడుస్తున్న ఫోటోలు ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.