సంబంధిత వార్తలు
- `పీనట్ డైమండ్` టీజర్ విడుదల చేసిన దిల్ రాజు (video)
- 'పచ్చీస్' టీజర్ నచ్చిందన్న విజయ్ దేవరకొండ
- కట్టుకున్నవాడ్ని వదిలి అరణ్యానికి వచ్చిన సాయిపల్లవి దొంగలంజెడి కొడుకా! అన్నదెందుకు? (video)
- `నారప్ప` ఆవిష్కరించిన `నరసింహపురం` టీజర్
- జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా.. పవన్ పోస్టు వైరల్
సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడి' టీజర్ వచ్చేసింది
Bazaar Rowdy, teaser
మైత్రి నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ "టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంపూర్నేష్ నటించిన ప్రీవియస్ ఫిలిమ్స్ 'హృదయ కాలేయం','కొబ్బరి మట్ట' లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు.
'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ " సంపూర్నేష్ బాబు గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. దేవుడి మనుషుల్ని పుట్టిస్తాడు. అలా రాజమౌళి గారు ఒక ట్వీట్ తో సంపూ గారిని పుట్టించారు.మనందరికీ చూపించారు.
సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ " ఒక చిన్న నటుడ్ని ఆదరించిన ప్రేక్షకులు ఈ 'బజార్ రౌడి' ని కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా. నా నుండి ప్రేక్షకులు ఏమైతే ఆశిస్తారో వాటికి మించి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. మా నిర్మాత గారు ఇందులో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని వారితో నటించే అవకాశం నాకు కల్పించారు. ప్రతీ ఒక్కరూ వారి వర్క్ లో బెస్ట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నా." అన్నారు.
హీరోయిన్ మహేశ్వరీ మాట్లాడుతూ " షూట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా వాచ్ చేయండి"అన్నారు.
Maheswari, Sampoo
నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరూ సహకారం అందిస్తూ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎడిటింగ్ లో ఎడిటర్ గౌతంరాజు గారి సలహాలు , సూచనలు తీసుకుంటున్నాం. ఈ బజార్ రౌడి ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా"అన్నారు.
దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ " బర్నింగ్ స్టార్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఆధ్యాంతం ఎంటర్టైన్ చేసేల ఉంటుంది."అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, సమీర్, మహేష్ కత్తి మాట్లాడుతూ... సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.
