సంబంధిత వార్తలు
- కేటీఆర్ - కవితలకు కుక్కకూడా ఓటు వేయదు : బీజేపీ ఎంపీ అర్వింద్
- 'పుష్ప-2' చిత్రం చూస్తూ అభిమాని మృతి (Video)
- Allu Arjun Pushpa2: ఆ హీరోయిన్ను అక్కడ తాకాడా? ఆ హీరోయిన్ ఎవరు?
- బాక్సాఫీస్ వద్ద వైల్డ్‌ఫైర్ బ్లాస్ట్... 4 రోజుల్లో 'పుష్ప-2' రూ.829 కోట్లు వసూలు
- Pushpa 2 Rs 500 crore: రూ. 500 కోట్ల మార్కును చేరిన పుష్ప-2
'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జనసందోహం... అదో మార్కెటింగ్ ట్రిక్ : హీరో సిద్దార్థ్
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా వేదికగా జరిగిన 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు తరలిరావడం, అదీకూడా ఓ తెలుగు హీరో నటించిన చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ పాట్నాలో విజయవంతంగా నిర్వహించడం సంచలనంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‌కు వచ్చిన జనసందోహంపై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన తాజా చిత్రం "మిస్ యూ" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడారు.
బీహార్‌లోని పాట్నాలో 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే. అది పెద్ద విషయం కాదు. రోడ్డుపై జేసీపీ వర్క్ చేస్తున్నా కూడా ఎక్కువ మంది గుమికూడుతారన్నారు.
బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం పెద్ద మ్యాటర్ కాదన్నారు. పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే ప్రజలు గుమికూడుతారని అన్నాడు. ఒక్క బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ ఇస్తే రాజకీయ నాయకులక మీటింగ్‌కు జనాలు విపరీతంగా వస్తారని, అలా అని రాజకీయ పార్టీలు గెలుస్తాయా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమ హీరోను ఉద్దేశించి సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నోటి దురుసుతనం వల్లే ఒకపుడు టాప్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ సినిమాలు ఇపుడు చూసే వారు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
