సంబంధిత వార్తలు
- రాకాస హక్కులను సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్
- Sangeeth Shobhan :: పదే పదే ప్రాణం నిన్నే కోరగా.. అంటూ ప్రేమగీతంలో అలరించిన సంగీత్ శోభన్, నయన్ సారిక
- Satya: జెట్లీ షూటింగ్ లో సత్య ను ఆడుకున్న దర్శకుడు రితేష్ రానా
- నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస’నుంచి రపప్పా.. రపప్పా.. పాట విడుదల
- శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్
Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్
Rakasa Snake Dance
ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇప్పటి వరకు రపప్పా, పదే పదే పాటల్ని మేకర్లు రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి స్నేక్ డ్యాన్స్ అనే పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌ని చూస్తుంటే ఇదొక ప్రమోషనల్ గీతంగా కనిపిస్తోంది. గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాటను కంపోజ్ చేశారు.
స్నేక్ డ్యాన్స్ పాటలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్, నయన్ సారిక తమ స్టైల్లో దుమ్ములేపేశారు. ఇక చివర్లో మెగా ప్రొడ్యూసర్ నిహారిక వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. ఈ పాటకు అనుదీప్ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. రఘురాం సాహిత్యం ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణ.
రాజు ఎదురోలు ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఏప్రిల్ 3న ఈ మూవీని భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.
నటీనటులు : సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్
రచన & దర్శకత్వం : మానస శర్మ
DOP : రాజు ఎదురురోలు
సంగీతం : అనుదీప్ దేవ్
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
కొరియోగ్రఫీ : జెడి, భాను
ఆర్ట్ డైరెక్టర్ : విష్ణు వర్ధన్ పుల్లా
కాస్ట్యూమ్ డిజైనర్ : సంధ్య సబ్బవరపు
పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
